నేడు ఐక్యరాజ్యసమితి అత్యవసర సమావేశం
రష్యా దాడులపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ నేడు సమావేశం కానుంది.
రష్యా దాడులపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ నేడు సమావేశం కానుంది. అత్యవసరంగా జరిగే ఈ సమావేశంలో ఉక్రెయిన్ పై రషయా దాడులను ఖండించనున్నారు. 199 సభ్య దేశాలున్న ఐక్యరాజ్యసమితి అత్యవసరంగా సమావేశమై రష్యా దూకుడుపై చర్చించనుంది. అంతర్జాతీయ నిబంధనలను రష్యా అతిక్రమిస్తుందని ఇప్పటికే ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది.
ఇప్పటికే భద్రతా మండలిలో....
ఇప్పటికే భద్రతా మండలిలో దీనిపై చర్చ జరిగింది. రష్యా దాడులను తీవ్రంగా వ్యతిరేకించింది. భద్రతా మండలిలో ఓటింగ్ కూడా జరిగింది. రష్యాకు వ్యతిరేకంగా పెట్టిన తీర్మానంలో 11 దేశాలు అనుకూలంగా ఓట్లు వేయగా, భారత్, చైనా, యూఏఈలు దూరంగా ఉన్నాయి. ఈ అత్యవసర సమావేశంలో మాత్రం భారత్ ఒక సందేశాన్ని పంపింది. వెంటనే రష్యా దాడులను ఆపివేయాలని కోరింది.