Ukraine War : భద్రతామండలిలో తీర్మానం.. భారత్ దూరం
ఉక్రెయిన్ పై రష్యా దాడికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానం చేశారు. ఇందుకు ఓటింగ్ ప్రక్రియను చేపట్టారు.
ఉక్రెయిన్ పై రష్యా దాడికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానం చేశారు. ఇందుకు ఓటింగ్ ప్రక్రియను చేపట్టారు. ఈ ఓటింగ్ కు భారత్ తో పాటు చైనా కూడా దూరంగా ఉంది. ఉక్రెయిన్ నుంచి రష్యా దళాలు వెంటనే వెనక్కు వచ్చేయాలని భద్రతా మండలి తీర్మానం చేసింది. ఎలాంటి షరతులు లేకుండా రష్యా తన సైన్యాన్ని వెనక్కు రప్పించాలని తీర్మానంలో అత్యధిక శాతం దేశాలు అభిప్రాయపడ్డాయి.
సైన్యం వెనక్కు వెళ్లాలని.....
రష్యా ఉక్రెయిన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించిందని భద్రతామండలి పేర్కొంది. అమెరికాతో పాటు అల్బేనియాలు ముసాయిదా తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి సమర్పించాయి. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, సామాన్య పౌరులు కూడా మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తమయింది. అయితే ఈ ఓటింగ్ కు భారత్, చైనాలు దూరంగా ఉండటం విశేషం.