Ukraine Crisis : పుతిన్ పెద్ద ఆక్రమణదారుడు

రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడే అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు.

Update: 2022-02-25 02:31 GMT

రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడే అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. రష్యాపై మరింత కఠిన ఆంక్షలు విధించనున్నామన్నారు. రష్యాను అన్ని రకాలుగా దిగ్భంధనం చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఇప్పటికే రష్యాకు చెందిన వివిధ బ్యాంకులను సీజ్ చేశారు. ఉక్రెయిన్ పై దాడి అమానుషమని చెప్పారు. పుతిన్ ను ఒక ఆక్రమణదారుడిగా బైడెన్ అభివర్ణించారు. పుతిన్ రష్యాను సోవియట్ యూనియన్ గా మార్చేందుకే ఈ యుద్ధానికి దిగినట్లు అనిపిస్తుందన్నారు.

ఆయన ఆలోచనలు...
అంతర్జాతీయ సమాజం ఆలోచనలకు విరుద్ధంగా పుతిన్ పయనిస్తున్నారని జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాకు వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం ఏకమవుతుందని చెప్పారు. అమెరికా పై రష్యా సైబర్ దాడులకు దిగినా తాము సిద్ధంగా ఉన్నామని జో బైడెన్ తెలిపారు. జీ 7, ఈయూ కూటమి దేశాలు కూడా రష్యాపై ఆంక్షలు విధించాలని జో బైడెన్ కోరారు. రష్యా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని బైడెన్ హెచ్చరించారు.


Tags:    

Similar News