Ukraine War : మూడో రోజు యుద్ధం... మరణాలు మాత్రం?

రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. రష్యా బలగాలు ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలను ఆక్రమించుకున్నాయి

Update: 2022-02-26 02:03 GMT

రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. రష్యా బలగాలు ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలను ఆక్రమించుకున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలపై రష‌యా జెండాను పాతాయి. పలు విమానాశ్రయాలను కూడా స్వాధీనం చేసుకున్న రష్యన్ సైనికులు పూర్తి స్థాయి ఆక్రమణకు సిద్ధమయినట్లే కనిపిస్తుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను పూర్తిగా రష్యన్ బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి.

ఎయిర్ పోర్టులు, నగరాలు....
ఇతర దేశాలతో ఉక్రెయిన్ కు మధ్య సంబంధాలను రష్యా తెంపేసింది. అయితే రష్యా బలగాలను ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలొడ్డి ఎదుర్కొంటున్నారు. ఉక్రెయిన్ లోని సాధారణ పౌరులకు కూడా ప్రభుత్వం ఆయుధాలు ఇవ్వడంతో వారు కూడా రష్యన్ సైనికులను అడ్డుకుంటున్నారు. దీంతో ఇప్పటికే వెయ్యి మందికి పైగా రష్యన్ సైనికులు ఈ యుద్ధంలో హతమయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉక్రెయిన్ అధికారికంగా ప్రకటించింది.
ఆయుధాలు వీడితేనే...
ఉక్రెయిన్ సైనికులు ఆయుధాలు వీడితేనే చర్చలకు తాము సిద్దమని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఆయుధాలు వీడి ఉక్రెయిన్ సైనికులు లొంగిపోవాలని పుతిన్ పిలుపునిచ్చారు. ఆయుధాలు వీడకుండా ఉంటే చర్చలు అసాధ్యమని ఆయన తేల్చి చెప్పారు. దీంతో ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతాయని భావించినా ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేటట్లు కన్పించడం లేదు. ఉక్రెయిన్ చివరి వరకూ పోరాడాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తుంది.


Tags:    

Similar News