Ukraine War : కొనసాగుతున్న దాడులు.. ఆసుపత్రి ధ్వంసం
రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం పదిహేనో రోజుకు చేరుకుంది. చర్చలంటూనే యుద్ధాన్ని మాత్రం రష్యా ఆపడం లేదు
రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం పదిహేనో రోజుకు చేరుకుంది. చర్చలంటూనే యుద్ధాన్ని మాత్రం రష్యా ఆపడం లేదు. నివాస ప్రాంతాలపై కూడా దాడులు చేస్తున్నారు. ఉక్రెయిన్ లో ఏ భవనాన్ని రష్యా సేనలు వదలిపెట్టడం లేదు. తాజాగా రష్యా సేనల ధాటికి మరియపోల్ లోని ఒక ఆసుపత్రి ధ్వంసమయింది. ప్రసూతి ఆసుపత్రిని రష్యా సేనలు పేల్చి వేశాయి. దీంతో ఈ ఆసుపత్రి శిధిలాల కింద అనేక మంది చిక్కుకున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ట్వీట్ చేశారు.
ప్రజలను తరలిస్తూనే....
ఒక వైపు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలిస్తూనే నివాస ప్రాంతాలను రష్యా లక్ష్యంగా ఎంచుకుంది. ప్రధాన నగరాల్లోని భవంతులన్నీ దాదాపుగా ధ్వంసమయ్యాయి. కీవ్, ఖర్కీవ్, సుమీ, మరియపోల్ వంటి ప్రాంతాలు బాంబు దాడులతో దద్దరిల్లి పోతున్నాయి. జెలెన్ స్కీ నాటో సభ్యత్వాన్ని స్వీకరించనని ప్రకటించడంతో మరోసారి చర్చలకు మార్గం సుగమమయింది. యుద్ధాన్ని ఆపి చర్చలను త్వరగా ప్రారంభించాలని ఉక్రెయిన్ కోరుతుంది.