జో బెడైన్ తో జెలెన్ స్కీ.... సాయం చేయండి
ఉక్రెయిన్ - రష్యాల మధ్య యుద్ధం పది రోజులుగా కొనసాగుతుంది. ఇరు దేశాలు రెండు సార్లు చర్చలు జరిపినా ఫలితం లేదు
ఉక్రెయిన్ - రష్యాల మధ్య యుద్ధం పది రోజులుగా కొనసాగుతుంది. ఇరు దేశాలు రెండు సార్లు చర్చలు జరిపినా ఫలితం లేదు.రేపు మూడోసారి చర్చలు జరపాలని నిర‌్ణయించారు. ఈనేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన ఆరోపణలు చేశారు. రష్యా బలగాల చేతితో నాలుగు లక్షల మంది పౌరులు బందీలుగా ఉన్నారని ఆయన తెలిపారు. జెలెన్ స్కీ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కు ఫోన్ చేసి రక్షణ, ఆర్థిక సాయాన్ని అందించాలని కోరారు.
చర్చల కోసం.....
యుద్ధనివారణకు తాము చర్చల కోసం ప్రయత్నిస్తున్నా రష్యా అంగీకరించకుండా షరతులు విధిస్తుందని తెలిపారు. రష్యాపై ఆంక్షలు కొనసాగించాలని ఆయన కోరారు. కాగా రష్యా సేనలు ఇప్పటికే ఉక్రెయిన్ లోకి ప్రవేశించాయి. భీకర దాడులు జరుగుతున్న నేపథ్యంలో జెలెన్ స్కీ బైడెన్ తో సంభాషణ ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా యుద్ధ విమానాన్ని కూల్చేశామని జెలెన్ స్కీ చెప్పారు.