Ukraine War : ఒక నగరం రష్యా పరం
ఉక్రెయిన్ - రష్యాల మధ్య యుద్ధం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఖేర్‌సన్ నగరాన్ని రష్యా సైనికులు స్వాధీనం చేసుకున్నారు
ఉక్రెయిన్ - రష్యాల మధ్య యుద్ధం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఖేర్‌సన్ నగరాన్ని రష్యా సైనికులు స్వాధీనం చేసుకున్నారు. ఈ యుద్ధంలో రష్యా స్వాధీనం చేసుకున్న తొలి నగరమిదే. ఈ విషయాన్ని ఉక్రెయిన్ సయితం థృవీకరించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ వైపునకు రష్యా సైన్యం దూసుకు వస్తుంది. ఏ క్షణంలోనైనా కీవ్ లోకి రష్యా సైన్యం ప్రవేశించే అవకాశముంది. అలాగే కీవ్ లో మెట్రో రైల్వే స్టేషన్ ను బాంబులతో రష్యా సైన్యం పేల్చి వేసింది.
ఒడెస్సా నగరాన్ని....
ఒడెస్సా నగరంపై పెద్దయెత్తున బాంబు దాడులు జరిగే అవకాశముంది. దీంతో అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు. రష్యాకు చెందిన వార్ షిప్ లు ఇప్పటికే ఒడెస్సాకు సమీపంలోకి చేరుకున్నాయి. కీవ్, ఖార్కివ్ నగరాలను స్వాధీనం చేసుకునేందుకు రష్యా సైన్యం శ్రమిస్తుంది. దీనికి ధీటుగా ఉక్రెయిన్ పౌరులు, సైనికులు పోరాడుతున్నారు. ఎనిమిదో రోజు ఉక్రెయిన్ పై రష్యా భీకరంగా దాడులు చేసే అవకాశముందని చెబుతున్నారు.