Gold Price Today : పరుగులు తీస్తున్న బంగారం ధరలు... అదే బాటలో వెండి ధరలు
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది;

బంగారం ధరలు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. ధరలు ఎంతగా అంటే ఎవరికీ అందనంత ధరలు పసిడిప్రియులకు షాకిస్తున్నాయి. ప్రతి రోజూ ధరలు పెరుగుతూ బంగారం, వెండి భయపెడుతుంది. ఒకదానిని మించి మరొకటి పోటీ పడుతుంది. ధరలు ఇంత స్థాయిలో పెరగడం గతంలో ఎన్నడూ చూడలేదని వ్యాపారులు కూడా చెబుతున్నారు. మార్కెట్ నిపుణులు కూడా అదే విషయాన్ని చెబుతున్నారు. బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని, అయితే ఎప్పుడు ధరలు పెరుగుతాయో చెప్పలేని పరిస్థితుల్లో అవసరాలకు తగినట్లుగా బంగారం, వెండి వస్తువులను ఇప్పుడే కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నారు. ఎవరూ ధరలు తగ్గుతాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
సీజన్ సమయంలోనూ...
మరోవైపు పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో పాటు పెళ్లిళ్లు, శుభకార్యాలతో రెండు తెలుగు రాష్ట్రాలు మంగళవాయిద్యాలతో మారుమోగిపోతున్నాయి. పెళ్లిళ్లకు వసరమైన బంగారం, వెండి ధరలు మాత్రం భయపెడుతున్నా అంతగా భయపడాల్సిన పనిలేదని చెబుతున్నారు. ఎందుకంటే బంగారం, వెండి వస్తువుల ధరలు మరింత పెరుగుతాయని, ఈ ఏడాది బంగారం పది గ్రాములకు లక్ష రూపాయలుకు చేరుకుంది. కిలో వెండి ధర 1.14 లక్షలకు చేరుకుంది. బంగారం ధరలు ఎక్కువ కావడంతో ఎక్కువగా ఇతర ఆప్షన్లు వినియోగదారులు చూసుకుంటున్నారు. బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం దగ్గర నుంచి వడ్డీ ధర ఎక్కువగా లభించే బ్యాంకుల్లో తాము దాచుకున్న సొమ్మును ఫిక్స్ డ్ డిపాజిట్ రూపంలో పెడుతున్నారు.
మళ్లీ పెరిగి...
మరికొందరు మంచి లాభాలను ఆర్జించి పెట్టే రియల్ ఎస్టేట్ రంగంపై కూడా ఇటీవల కాలంలో పెట్టుబడులు పెరిగాయంటున్నారు. బంగారం ధరలు ఎప్పటికైనా తగ్గి తాము పెట్టిన పెట్టుబడికి నష్టం వస్తుందని భావించి ఈ రకమైన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు నమోదయిన వివరాలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 85,110 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 92,850 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,14, 100 రూపాయలకు చేరుకుంది.