ఏపీలో తప్పిన మరో రైలు ప్రమాదం
సుమారు వెయ్యిమంది క్షతగాత్రులు ఆసుపత్రులపాలయ్యారు. 250 మంది బాధితులను అధికారులు స్పెషల్ ట్రైన్ ద్వారా..
ఒడిశాలో జరిగిన కోరమాండల్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకూ 278 మంది మృతి చెందినట్లు సమాచారం. సుమారు వెయ్యిమంది క్షతగాత్రులు ఆసుపత్రులపాలయ్యారు. 250 మంది బాధితులను అధికారులు స్పెషల్ ట్రైన్ ద్వారా భద్రక్ నుంచి చెన్నైకు పంపిస్తున్నారు. దేశ చరిత్రలోనే ఇదే అతిపెద్ద రైలు ప్రమాదంగా చెబుతున్నారు అధికారులు. తాజాగా ఏపీలో మరో రైలు ప్రమాదం తృటిలో తప్పింది.
సత్యసాయిజిల్లా కదిరి రైల్వే గేట్ వద్ద రైలు ప్రమాదం తప్పింది. నాగర్ కోయిల్ - ముంబై రైలు వచ్చే సమయంలో గేట్ మెన్ గేటు వేయలేదు. దాంతో రైలును గమనించకుండా వాహనదారులు గేట్ దాటారు. ఇది గమనించిన లోకో పైలట్ ట్రైన్ ను ఆపివేశాడు. లోకో పైలట్ అప్రమత్తంగా లేకపోయుంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. గేట్ మెన్ నిర్లక్ష్యంపై అధికారులు విచారణ చేస్తున్నారు.