జైలులో భోజనం ఏంటంటే?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తొలిసారి జైలు జీవితం గడుపుతున్నారు. ఆయనకు సిబ్బంది మధ్యాహ్న భోజనం తెచ్చారు

Update: 2023-09-11 08:33 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తొలిసారి జైలు జీవితం గడుపుతున్నారు. ఇప్పటికే కొన్ని గంటలు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఖైదీ నెంబరు 7691 నెంబరును కేటాయించారు. అత్యంత భద్రతను ఆయన గది వద్ద ఏర్పాటు చేశారు. అటు వైపు జైలులో ఉండే ఏ ఖైదీ వెళ్లకుండా అవసరమైన అన్ని చర్యలు జైలు అధికారులు తీసుకున్నారు. ములాఖత్ కు వచ్చే వారి పట్ల జాగ్రత్త గా వ్యవహరించాలని, ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని  డీజీపీ నుంచి ఆదేశాలు అందాయి.

పుల్కాతో పాటు...
చంద్రబాబు ఎప్పుడూ సమయానికి భోజనం చేస్తారు. అదే ఆయన ఫిట్‌నెస్ కు కారణమని చెబుతారు. ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవచ్చన్న న్యాయమూర్తి ఆదేశాలతో ఆయన భద్రతా సిబ్బంది మధ్యాహ్న భోజనాన్ని చంద్రబాబు కోసం తెచ్చారు. పుల్కాలతో పాటు వెజ్ కర్రీ, సలాడ్, ఫ్రూట్ బౌల్, మజ్జిగ, హాట్ వాటర్ ను తీసుకు వచ్చారు. జైలు అధికారులు పరీక్షించిన తర్వాత వాటిని చంద్రబాబుకు అందించనున్నారు.
ములాఖత్ కోసం...
కాగా ఈరోజు చంద్రబాబును కలిసేందుకు ఎవరూ రాలేదు. ఆయన ములాఖత్ కోసం ఎవరూ దరఖాస్తు ఇంత వరకూ చేసుకోలేదని జైలు అధికారులు చెబుతున్నారు. ఈరోజు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి జైలుకు వచ్చి కలుస్తారని అందరూ భావించారు. కానీ ఇంతవరకూ ములాఖత్ కు దరఖాస్తు చేసుకోలేదు. సాయంత్రం ఆరు గంటల వరకే ములాఖత్ కు సమయం ఉంటుంది. ఈలోపు వారు వస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News