బాలయ్య యాక్టివ్ అయ్యారే

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ఆయన పార్టీ బాధ్యతలను చూస్తున్నారు.;

Update: 2023-09-12 07:30 GMT

నందమూరి బాలకృష్ణ రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆయన పెద్దగా పట్టించుకోరు. తన సినిమాలు..తన షూటింగ్ లు అంతే ఆయన దినచర్య. అప్పుడప్పుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గానికి వెళ్లి అక్కడి సమస్యలపై దృష్టి పెడుతుంటారు. మహానాడు మినహా మరే ఇతర పార్టీ కార్యక్రమాలకు బాలయ్య హాజరైన ఘటనలు కూడా చాలా స్వల్పంగానే ఉన్నాయి. తన బావ చంద్రబాబు, అల్లుడు లోకేష్ పార్టీ వ్యవహారాలను చూసుకుంటుండటంతో పెద్దగా ఎప్పుడూ ఆయన ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ గా కనిపించలేదు. అసలు బాలయ్య పార్టీ కార్యాలయానికి కూడా రారు.

పార్టీ కార్యాలయానికి..

అయినా ఆయనను ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే బాలకృష్ణకు రాజకీయాల పట్ల అంత ఆసక్తి లేకపోవడంతో పాటు పెద్దగా బాధ్యతలేవీ లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. అందుకే అతి తక్కువ సార్లు తెలుగు తమ్ముళ్లు బాలయ్య బాబును పార్టీ కార్యాలయంలో చూశారనే చెప్పాలి. మహానాడు వంటి కార్యక్రమాలకు కూడా చివరి రోజు హాజరై తాను ప్రసంగించి వెళ్లిపోయిన విషయాన్ని కొన్నేళ్లుగా గమనిస్తున్నాం. కానీ ఇప్పుడు బాలయ్య తీరులో మార్పు కనిపిస్తుంది.

బాబు అరెస్ట్ తో…

తన బావ, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన వెంటనే బాలయ్య స్పెషల్ ఫ్లైట్ లో విజయవాడకు చేరుకున్నారు. బెజవాడలోనే మకాం వేశారు. సీఐడీ కార్యాలయంలోనూ చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా తాను బయటకు వచ్చేంత వరకూ పార్టీ పరిస్థితిని చూసుకోవాలని చంద్రబాబు బాలయ్యకు చెప్పినట్లు తెలిసింది. అందుకే ఆయన శనివారం నుంచి బెజవాడలోనే ఉండి సీనియర్ నేతలతో వరస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి వస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా మీడియా సమావేశంలోనూ మాట్లాడారు. చంద్రబాబు జైల్లో ఉండటం, అల్లుడు లోకేష్ కూడా రాజమండ్రిలోనే ఉండటం కారణంగా పార్టీ బాధ్యతలను బాలయ్య బాబు తన భుజాన వేసుకున్నట్లు కనపడుతుంది.

చిన్న అవకాశం కూడా…

చంద్రబాబు ఎవరినీ నమ్మరు. అందునా తన అరెస్ట్ లో “పెద్దల” హస్తం ఉందని భావిస్తున్న చంద్రబాబు ఏ చిన్న ఛాన్స్ కూడా ప్రత్యర్థులకు ఇవ్వరు. అందుకే పార్టీ వ్యవహారాలను బాలకృష్ణను చూసుకోవాల్సిందిగా తెలిపినట్లు పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వరసగా సీనియర్ నేతలతో సమావేశం కావడంతో పాటు జిల్లా నేతలతో కూడా సమీక్షలను నిర్వహించడం కూడా బాలకృష్ణ చేస్తున్నారంటే తాను స్వయంగా తీసుకున్న నిర్ణయం మాత్రం కాదు. అంతేకాదు చంద్రబాబు అరెస్ట్ తో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను పరామర్శించడానికి కూడా బాలయ్య బయలుదేరి వెళుతున్నారు.

పార్టీ బాధ్యతలను…

నందమూరి బాలకృష్ణ రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆయన పెద్దగా పట్టించుకోరు. తన సినిమాలు..తన షూటింగ్ లు అంతే నందమూరి బాలకృష్ణ రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆయన పెద్దగా పట్టించుకోరు. తన సినిమాలు..తన షూటింగ్ లు అంతే అంటే బావ జైలు నుంచి బయటకు వచ్చేంత వరకూ పూర్తి పార్టీ బాధ్యతలను బాలకృష్ణ తీసుకుంటారన్నది చెప్పకనే తెలుస్తోంది. సీనియర్ నేతలను ఎవరినీ జోక్యం చేసుకోకుండా వారి సలహాలను తీసుకుని వాటిని ఇంప్లిమెంట్ చేయడానికే బాలయ్యను చంద్రబాబు రంగంలోకి దించినట్లు విశ్వసనీయ సమాచారం. మొత్తం మీద లెజెండ్ ఫ్యాన్స్ మాత్రం తమ హీరో రాజకీయంగా కూడా ఇన్నాళ్లకు హైలెట్ అవుతుండటం ఒకింత ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు.



Tags:    

Similar News