Breaking : 19వరకూ చంద్రబాబు జైలులోనే
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసులో క్వాష్ పిటీషన్ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసులో క్వాష్ పిటీషన్ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది. దీనిపై పూర్తి వాదనలను వినాలని హైకోర్టు అభిప్రాయపడింది. క్వాష్ పిటీషన్ పై కౌంటర్ పిటీషన్ వేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 19న తిరిగి క్వాష్ పిటీషన్ విచారణకు రానుంది. దీంతో చంద్రబాబు మంగళవారం వరకూ రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఉండాల్సిన అవసరం ఉంది. దీంతో టీడీపీ శ్రేణులు నిరాశా నిస్పృహలో పడిపోయాయి. ఇరువైపులా వాదనలను పూర్తిగా వినాలని హైకోర్టు అభిప్రాయపడింది.
కొంత ఊరట...
అయితే చంద్రబాబుకు కొంత ఊరట లభించింది. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబును విచారించడానికి తమ కస్టడీకి అప్పగించాలన్న సీఐడీ పిటీషన్ ను హైకోర్టు తిరస్కరించింది. వచ్చే సోమవారం వరకూ చంద్రబాబు కస్టడీ పిటీషన్ పై విచారణ చేయవద్దని ఏసీబీ కోర్టుకు హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో మాత్రం కొంత రిలీఫ్ లభించినా క్వాష్ పిటీషన్ వాయిదా పడటం మాత్రం టీడీపీ అధినేతకు కొంత ప్రతికూల అంశమేనని చెప్పాలి. దీంతో ఈ నెల 19వ తేదీ వరకూ చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఉండనున్నారు.