నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15వ తేదీ వరకూ ఈ పరీక్షలను నిర్వహించనున్నారు

Update: 2023-04-03 01:47 GMT

నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15వ తేదీ వరకూ ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 6,09,070 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు ఏపీ విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు మరో 53,140 మంది ఉన్నారని, ఓపెన్ స్కూల్ విద్యార్థులు 1,525 మంది ఉన్నారని తెలిపారు.

సెల్‌ఫోన్లను...
పదో తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రశ్నాపత్రాలు లీకేజీ కాకుండా పలు చర్యలు తీసుకుంటున్నారు. పరీక్ష కేంద్రంలోకి ఉపాధ్యాయులు, ప్యూన్లతో సహా ఎవరినీ ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్‌ కాని, సెల్‌ఫోన్లు కాని అనుమతించరు. ఇందుకోసం 3,349 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.


Tags:    

Similar News