రేపటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్
పదో తరగతి పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను విద్యా శాఖ అధికారులు పూర్తి చేశారు
పదో తరగతి పరీక్షలు రేపటి నుంచి ఏపీలో ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను విద్యా శాఖ అధికారులు పూర్తి చేశారు. రేపటి నుంచి ఈనెల 18వ తేదీ వరకూ పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి 12.45 వరకూ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి ఉదయం 8.45 గంటల నుంచి 9.30 గంటల వరకూ మాత్రమే అనుమతిస్తారు.
ఫ్రీ ప్రయాణం...
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పించనున్నారు. తమ పరీక్ష కేంద్రం వరకూ, అక్కడి నుంచి ఇంటి వరకూ హాల్ టిక్కెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించవచ్చు. దీంతో పాటు పదోతరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ నిన్న ఉన్నతాధికారులతో సమీక్షను నిర్వహించారు.