శ్రీకాకుళం బీచ్ లో కనిపించింది ఏంటంటే?
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం బీచ్ ఒడ్డున తెల్లవారుజామున భారీ వేల్ షార్క్ కొట్టుకువచ్చింది
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం బీచ్ ఒడ్డున తెల్లవారుజామున భారీ వేల్ షార్క్ కొట్టుకువచ్చింది. డొంకూరు సముద్ర తీరంలో సుమారు రెండు టన్నుల బరువు ఉండే పులిబుగ్గ సొరచేప కనిపించింది. సుమారు 15 అడుగుల పొడుగు, ఏడడుగుల వెడల్పు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ భారీ సొరచేపను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు.
ఆటలాడిన పిల్లలు:
ఇచ్చాపురం మండల పరిధిలోని డోంకురు సముద్ర తీర ప్రాంతానికి ఈ భారీ చేప కొట్టుకొచ్చిందని వాట్సాప్ గ్రూప్స్ లో వైరల్ అయిందని స్థానికులు తెలిపారు. దీంతో స్థానికులు ఈ భారీ చేపను చూసేందుకు తరలివచ్చారు. పిల్లలు సముద్ర తీరానికి చేరుకుని తిమింగలంపై ఎగురుతూ ఆటాలాడారు. భారీ చేపకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కొన్ని వారాల కిందట శ్రీకాకుళం రూరల్ మండలం పరిధిలోని కుందువానిపేట, పెదగనగళ్లపేట బీచ్ తీరంలో సముద్రతాబేళ్ల మృత కళేబరాలు కనిపించడంతో జనం ఎంతగానో భయపడి పోయారు. బీచ్ వెంబడి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు, పర్యాటకులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. యంత్రాంగం స్పందించి తాబేళ్ల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.