రేపటి నుంచి ఇంటర్ క్లాసులు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచే 2025-26 ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది;

Update: 2025-03-31 12:16 GMT
intermediate, clases, tomorrow, andhra pradesh
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచే 2025-26 ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. సెకండియర్ విద్యార్థులకు మంగళవారం క్లాసులు మొదలు కానుండగా, ఫస్టియర్ లో చేరే వారికి వచ్చే 7వ తేదీ నుంచి అడ్మిషన్లు స్టార్ట్ అవుతాయి. ఈ నెల 23 వరకు తరగతులు నిర్వహించి వేసవి సెలవులను ప్రకటించనున్నట్లు ఉన్నత విద్యాశాఖ ఇప్పటికే ప్రారంభించింది.

వేసవి సెలవుల అనంతరం...
తిరిగి జూన్ 2న తిరిగి క్లాసులు పున: ప్రారంభం కానున్నాయని తెలిపింది. అలాగే జూనియర్ కళాశాలల పనివేళలను కూడా ఉన్నత విద్యాశాఖ పొడిగిస్తూ ఇది వరకే ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ తరగతుల వేళలను పొడిగించారు. అలాడే ఏడు పీరియడ్లకు బదుదు ఎనిమిది పీరియడ్లు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


Tags:    

Similar News