విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో కరోనా కలకలం.. 50 మందికి పాజిటివ్

ఆస్పత్రిలో పనిచేసే సిబ్బందిలో 50 మందికి పాజిటివ్ గా తేలింది. ఆస్పత్రి సూపరింటెండెంట్, 25 మంది వైద్యులు, పారా మెడికల్

Update: 2022-01-18 06:06 GMT

కృష్ణాజిల్లా విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో కరోనా కలకలం రేపింది. ఆస్పత్రిలో పనిచేసే సిబ్బందిలో 50 మందికి పాజిటివ్ గా తేలింది. ఆస్పత్రి సూపరింటెండెంట్, 25 మంది వైద్యులు, పారా మెడికల్ సిబ్బందికి కరోనా సోకినట్లు నిర్థారణ అయింది. వైద్యులకు పాజిటివ్ అని తెలియడంతో.. ఆస్పత్రిలో ఉన్న పేషంట్లు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. పాజిటివ్ వచ్చిన సిబ్బంది మొత్తం ప్రస్తుతం ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. వారితో డైరెక్ట్ గా కాంటాక్ట్ అయిన మిగతా సిబ్బందికి కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేస్తున్నారు.

కాగా.. రాష్ట్రంలో కరోనా క్రమంగా విజృంభిస్తోంది. సాధారణ ప్రజలతో పాటు.. రాజకీయ నేతలనూ వైరస్ చుట్టుముడుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, మాజీ మంత్రి దేవినేని ఉమ, పరిటాల శ్రీరామ్ లకు ఇటీవలే పాజిటివ్ గా నిర్థారణ అయింది. వారంతా ప్రస్తుతం హోం ఐసోలేషన్ లోనే చికిత్స పొందుతున్నారు.






Tags:    

Similar News