చెప్పుతో కొట్టుకున్న టీడీపీ కౌన్సిలర్
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మున్సిపల్ సమావేశం హాట్ టాపిక్ గా మారింది.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మున్సిపల్ సమావేశం హాట్ టాపిక్ గా మారింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో ఓ కౌన్సిలర్ సోమవారం తన ఓటర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నానని చెప్పుతో కొట్టుకున్నాడు. సోమవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో వార్డు నెంబర్ 20 కౌన్సిలర్ ఎం రామరాజు ఆవేదన వ్యక్తం చేశారు. విపక్ష సభ్యుడిని కావడం వల్లే తన ప్రాంత అభివృద్ధికి సహకరించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు టీడీపీ కౌన్సిలర్ రామరాజు. ఏం చేయాలో తెలియక సమావేశ మందిరంలోనే చెప్పుతో తనను తాను కొట్టుకున్నాడు.
నర్సీపట్నం మున్సిపల్ సమావేశంలో టీడీపీకి చెందిన 20వ వార్డు కౌన్సిలర్ రామరాజు తీవ్ర ఆవేదనకి లోనయ్యారు. కౌన్సిలర్ గా ఎన్నికై 30 నెలలు గడిచినా కనీసం ఒక కుళాయి కి ట్యాప్ కూడా వేయించలేకపోతున్నానని తెలిపారు. ఏ పనీ చేయించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తంచేశారు. చెప్పుతో కొట్టుకుని.. తన సీట్లో కూర్చుని కన్నీరు మున్నీరు అయ్యాడు. దీంతో సహచర కార్పొరేటర్లు సముదాయించే ప్రయత్నం చేశారు.