లయోలా కళాశాలలో ఘనంగా ముగిసిన ‘మానుస్’

మానుస్ 2023 ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. వ్యాపారవేత్తలు కావాలసే వారి కోసం రెండు రోజుల పాటు ఆంధ్ర లయోలా కళాశాలలో కొనసాగిన కార్యక్రమాలు ఆధ్యంతం అత్యంత ఆసక్తిగా, ఉత్సాహంగా కొనసాగాయి.

Update: 2023-09-03 08:54 GMT

 లయోలా కళాశాలలో  ఘనంగా ముగిసిన ‘మానుస్’ 


మానుస్-2023 ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. పోటీతత్వ స్ఫూర్తిని వెలికితీసి, వ్యాపార చతురత, నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని పరీక్షించిన ‘మానుస్" రెండు రోజుల పాటు ఆంధ్ర లయోలా కళాశాలలో కొనసాగిన కార్యక్రమాలు ఆధ్యంతం అత్యంత ఆసక్తిగా, ఉత్సాహంగా కొనసాగాయి. ఈ కార్యక్రమానికి రాజ్ దర్భార్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రొప్రయిటర్ వేగె వెంకటేశ్వరరావు చీఫ్ గెస్ట్ గా వ్యవహరించారు. కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ డీన్ రెవ. ఫా. డా. ఎస్. మిల్కేర్ రెడ్డి, ఈవెంట్ కో-ఆర్డినేటర్ జి. శ్రావణ్ కుమార్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ శ్రీమతి. డి ఉమాదేవిలు స్టేజ్ పై ఉన్నారు. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పార్మల్, ఇన్ ఫార్మల్స్ లో పాల్గొని తమ ఫెర్మామెన్స్ తో ఆకట్టుకున్నారు. ఈ వినూత్న కార్యక్రమానికి మేనేజ్మెంట్ విద్యార్థులు, డిగ్రీ, పీజీ కాలేజీల నుంచి బీబీఏ, బీకాం, ఎంబీఏ విద్యార్థులు 25 కాలేజీల నుంచి 500 మంది పైగా పాల్గొన్నారు. వారంతా ఫార్మల్, ఇన్ ఫార్మల్ ఈవెంట్స్ లో ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొన్నారు.ఫార్మల్ ఈవెంట్స్ లో బిజినెస్ క్విజ్, హ్యూమన్ రీసోర్స (మానవ వనరులు) ఫైనాన్స్, యంగ్ మేనేజర్, ప్రోడక్ట్ లాంచ్, బ్రాండ్ హంట్ వంటివి ఉండగా, ఇన్ఫార్మల్ ఈవెంట్స్ లో మిస్టర్ మానుస్, డాన్స్ , క్విక్ బీ, స్పాట్ ఫొటోగ్రఫీ పోటీలు జరిగాయి.

మిస్టర్. మానుస్ 2023 గా నలంద డిగ్రీ కాలేజ్ కు చెందిన మిస్టర్ హఫీజ్ చేజిక్కించుకొనగా, మిస్ మానుస్ 2023 గా, మరిస్ స్టెల్లా కళాశాల విద్యార్థిని ఇక్రా, విజయవాడకు చెందిన ఫోర్బ్స్ బిజినెస్ స్కూల్ విద్యార్థి ఓవరాల్ ఛాంపియన్ షిప్ ను దక్కించుకున్నారు.

మానుస్ 2023 కార్యక్రమాన్ని విజయంవంతం చేసిన విద్యార్థులకు, పోటీదారులకి ,టైటిల్ స్పాన్సర్ మెకానిక్క్స్, కో-స్పాన్సర్లైన రాజదర్భార్ ప్యామిలీ రెస్టారెంట్, హరివిల్లు సంస్థలకు, భాగస్వాములైన ఎన్ జే గాడ్జెట్స్ , షైనీ డెంటల్ క్లినిక్ , బోబహాలిక్ , గాడ్జెట్ షాక్, ఆంధ్రహాస్పిటల్స్ , రెడ్ ఓవెన్లకు , అఫీషియల్ మీడియా పార్టనర్ స్కైలైన్ ఫోటోగ్రఫీ, డిజిటల్ మీడియా పార్టనర్ తెలుగుపోస్టు.కం, రేడియో పార్టనర్ రెడ్.ఎఫ్ లకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

మిస్టర్.మానుస్ 2023 గా నలంద డిగ్రీ కాలేజ్ కు చెందిన మిస్టర్ హఫీజ్ చేజిక్కించుకొనగా, మిస్ మానుస్ 2023 గా, మరిస్ స్టెల్లా కళాశాల విద్యార్థిని ఇక్రా, విజయవాడకు చెందిన ఫోర్బ్స్ బిజినెస్ స్కూల్ విద్యార్థి ఓవరాల్ ఛాంపియన్ షిప్ ను దక్కించుకున్నారు అని ఈవెంట్ కో-ఆర్డినేటర్  శ్రవణ్ కుమార్ తెలుగుపోస్టు కి తెలిపారు. 



 


Tags:    

Similar News