నేడు అమరావతి పిటీషన్లపై విచారణ?
రాజధాని అమరావతి పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశముంది
రాజధాని అమరావతి పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశముంది. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శాసన వ్యవస్థకు అధికారాలు లేవని చెప్పడం సరికాదని పిటీషన్ లో పేర్కొంది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటీషన్ ను జస్టిస్ యు. యు. లలిత్ వేరే ధర్మాసనానికి బదిలీ చేశారు.
విభజన పిటీషన్లతో పాటు...
దీంతో నేడు దీనిపై విచారణ జరగనుంది. జస్టిస్ కేఎం జోసెఫ్, హుహికేష్ రాయ్ లతో కూడి ధర్మాసనం ఈ పిటీషన్లను విచారించనుంది. రైతులు కూడా తమ వాదనలను వినాలని కోరడంతో ఈ పిటీషన్లపై విచారణ జరగనుంది. దీంతో పాటు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు, పొంగులటి సుధాకర్ రెడ్డిలు వేసిన రాష్ట్ర విభజన, విభజన చట్టం హామీల అమలపై వేసిన పిటీషన్లను అన్నింటిని కలిపి ధర్మాసనం విచారించనుంది.