పార్టీ కోసం సార్వత్రిక ఎన్నికల్లో పనిచేసిన, యాంకర్ శ్యామలకి కీలక పదవి.

యాంకర్ శ్యామల....ఈమె సినీ నటి మరియు బుల్లితెర యాంకర్ గా రెండు రాష్ట్రాల్లోనూ తెలుగు ప్రజలకు సుపరిచితమే...

Update: 2024-09-14 11:00 GMT

Shyamala, YS jagan

యాంకర్ శ్యామల....ఈమె సినీ నటి మరియు బుల్లితెర యాంకర్ గా రెండు రాష్ట్రాల్లోనూ తెలుగు ప్రజలకు సుపరిచితమే... యాంకర్ గానే కాకుండా అడపా దడపా కొన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు..!!

ఈమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి 2019 లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చారు...కానీ పూర్తి స్థాయిలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో..ఆయా నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడిన అభ్యర్థుల తరపున విసృతంగా ప్రచారం చేసి,సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు..!! ఒక రకంగా చెప్పాలంటే... ప్రతిపక్ష పార్టీ లకు ట్రోల్ మెటీరియల్ కూడా అయ్యారని చెప్పుకోవచ్చు...సినిమా పరిశ్రమ నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీవ్రంగా వ్యతిరేకత ఉండి,ఎవరూ సపోర్ట్ చేయని సమయంలో... ధైర్యంగా ముందుకు వచ్చి జగన్కి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి సపోర్ట్ చేసారు...

ఈ క్రమంలో ఒకవేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే...ఆమె సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడం కష్టం.. ఆమెకు సినిమా అవకాశాలు కూడా ఎవరూ ఇవ్వరు..!! ఒకానొక ఇంటర్వూలో యాంకర్ ఈ విషయాన్ని శ్యామల తో ప్రస్తావించినప్పుడు..అయినా పర్వాలేదు... నేను జగన్ గారికి సపోర్ట్ చేస్తా అని చెప్పింది...!!

అయితే ఇందులో యాంకర్ శ్యామలది ప్రత్యేక స్థానంగా చెప్పుకోవచ్చు..!! ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి పార్టీ తరపున విసృతంగా ప్రచారం చేసి, పార్టీ ఓటమి పాలైన అనంతరం.. కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు , ఆఖరికి సినిమా పరిశ్రమలో తోటి నటులకు కూడా ట్రోల్ మెటీరియల్ అయింది....ఒకానొక సందర్భంలో..ఆ ట్రోల్ ధాటికి తట్టుకోలేక...""తన వల్ల ఎవరైనా ఇబ్బంది పడినా..ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా...తనని క్షమించాలని...రాజకీయాలతో పర్సనల్ విషయాలు ముడిపెట్టి ట్రోల్ చేయడం భావ్యం కాదని, భయాన్ని వ్యక్తం చేస్తూ..ఒక వీడియో రీలీజ్ చేసే వరకూ ఆ ట్రోల్ వెళ్ళింది "" అంటే అర్థం చేసుకోవచ్చు..!!

ఎట్టకేలకు తన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది, తగిన గుర్తింపు లభించింది... పార్టీ అధిష్టానం ఆమెను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించింది... కానీ రెండు మూడు రోజుల ట్రోల్ కే తట్టుకోలేక, భయపడి క్షమాపణలు చెప్పిన శ్యామల.. ఇప్పటి నుండి ప్రతినిత్యం వీటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది...మరి ఇవన్నీ దాటుకుని ఎలా ముందుకు వెళుతుందో వేచి చూడాలి..

Tags:    

Similar News