Mother's Day : రూ. 10 కోట్ల వ్యయంతో అమ్మకి గుడికట్టిన కొడుకు

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపుతున్న ఈ రోజుల్లో.. తన తల్లికి ఆప్యాయంగా నివాళిగా రూ.10 కోట్ల వ్యయంతో

Update: 2023-05-14 11:36 GMT

temple for mother in srikakulam district

నేడు మాతృదినోత్సవం. ఇది జరుపుకోవడం మన ఆనవాయితీ కాకపోయినా.. ఈరోజున పిల్లలంతా తమ తల్లులకు శుభాకాంక్షలు తెలిపి, వారిని ప్రత్యేకంగా ట్రీట్ చేస్తారు. తమకు నచ్చిన కానుకలు ఇచ్చి అమ్మల కళ్లల్లో సంతోషాన్ని చూడాలనుకుంటారు. అయితే.. ఓ కొడుకు తనను కన్న తల్లికి ఏకంగా ఒక గుడిని కట్టాలని సంకల్పించాడు. గతంలో కొందరు మాతృమూర్తులకు ఆలయాలు కట్టిన ఘటనలున్నాయి. కానీ.. ఇతను చేస్తున్న ఈ పని కాస్త ప్రత్యేకం.

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపుతున్న ఈ రోజుల్లో.. తన తల్లికి ఆప్యాయంగా నివాళిగా రూ.10 కోట్ల వ్యయంతో గుడి కట్టాలని సంకల్పించాడు. అతనే కృష్ణారావు, అనసూయాదేవి దంపతులకు జన్మించిన శ్రవణ్ కుమార్. శ్రవణ్ కుమార్ తల్లి 2008లో మరణించారు. తల్లి స్వర్గస్తురాలైన 11 ఏళ్ల తర్వాత 2019 మార్చిలో ఆమె స్వగ్రామంలోనే ఆలయం కట్టాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం రూ.10 కోట్ల బడ్జెట్ కేటాయించాడు. మాతృమూర్తికి నిర్మించే ఆలయానికి నల్లరాయిని ఉపయోగించారు. ప్రస్తుతం ఈ నిర్మాణం 70 శాతం పూర్తయింది.
ప్రతిభావంతులైన యాదాద్రి ఆలయానికి చెందిన ప్రముఖ వాస్తుశిల్పి బలగం చిరంజీవి, తమిళనాడుకు చెందిన శిల్పి పాండిదురై వంటి ప్రముఖుల మార్గదర్శకత్వంలో నైపుణ్యం కలిగిన హస్తకళాకారులు ఆలయ నిర్మాణం కోసం పనిచేస్తున్నారు. ఈ మాతృ ఆలయ ప్రధాన గోపురం 51 అడుగుల ఎత్తులో నిర్మించారు. పవిత్ర క్షేత్రం వైభవాన్ని మరింత పెంచుతూ పంచగోపురాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఆలయంలో ఒక విశేషమైన అంశం ఏమిటంటే, శ్రవణ్ కుమార్ తల్లి యొక్క క్లిష్టమైన రూపకల్పన. శిలలపై ఉన్న పురాతన శాసనాల నుండి మనోహరంగా ఉద్భవించేలా సూక్ష్మంగా రూపొందించబడింది. శ్రవణ్ కుమార్ తన తల్లికి ఆలయాన్ని కడుతుండటంతో మే 14, ఆదివారం మాతృదినోత్సవం సందర్భంగా గ్రామస్తులు అతడిని అభినందించారు.


Tags:    

Similar News