నేడు కూడా రాజధానిలో ఐఐటీ నిపుణుల బృందం

రాజధాని అమరావతిలో నేడు కూడా ఐఐటీ నిపుణుల బృందం పర్యటించనుంది

Update: 2024-08-03 02:45 GMT

 Andhra pradesh 

రాజధాని అమరావతిలో నేడు కూడా ఐఐటీ నిపుణుల బృందం పర్యటించనుంది. నిన్న అమరావతికి చేరుకున్న ఐఐటీ నిపుణుల బృందం పలు భవనాలను పరిశీలించింది. భవనాల నాణ్యతతో పాటు పలు అంశాలపై అధ్యయనం చేసింది. ఐదేళ్ల పాటు భవనాలను ఖాళీగా ఉంచడంతో దాని పరిస్థితిపై అధ్యయనం చేయడానికి ఐఐటీ నిపుణుల బృందాన్ని రప్పించారు.

నేడు ఐకానిక్ భవనాల నిర్మాణ....
ఈ బృందం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే పనులు మొదలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న కొన్ని భవనాలను పరిశీలించిన ఐఐటీ నిపుణుల బృందం నేడు ఐకానిక్ భవనాల నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించనుంది. వీరు నివేదిక ఇచ్చిన తర్వాతనే పనులు ఏ విధంగా చేపట్టాలి? ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశముంది.


Tags:    

Similar News