నేడు అమరావతిపై సుప్రీంకోర్టు
ఈరోజు రాజధాని అమరావతిపై సుప్రీంలో విచారణ జరగనుంది.
ఈరోజు రాజధాని అమరావతిపై సుప్రీంలో విచారణ జరగనుంది. రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును యధాతధంగా అమలు చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ అమరావతి రైతులు కూడా సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు.
ఇరు వర్గాల వాదనలు...
నేడు ఈ రెండు పిటీషన్లను న్యాయమూర్తి జస్టిస్ కె. ఎం. జోసెఫ్, జస్టిస్ బివి నాగరత్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం నేడు విచారించనుంది. అమరావతి విభజన చట్టం ప్రకారమే ఏర్పడిందంటూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అఫడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం వస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి జగన్ త్వరలోనే విశాఖకు పరిపాలన రాజధాని వస్తుందని ప్రకటించారు. ఈ క్రమంలో ఈ రోజు విచారణపై సర్వత్రా టెన్షన్ నెలకొంది.