మీరెప్పుడైనా తెల్ల కాకిని చూశారా..? ఇదిగో ఈ వీడియో చూడండి
స్థానిక ప్రభుత్వ కార్యాలయాల సముదాయం వద్ద చెట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే ఆ చెట్లపై ఎక్కువగా కాకులు వాలుతూ..
కాకి రూపంలో ఉన్న ఓ పక్షి అందరిని ఆశ్చర్యపర్చింది. చెట్టుపై వాలిన ఆ పక్షి తెల్లగా ఉండటంతో ఏంటా పక్షీ అని అందరు పోటీ పడి చూశారు. కానీ తెల్లగాఉన్న ఆ పక్షిని ముందుగా పావురం అనునుకున్నారు. కానీ తర్వాత తెలిసింది అది పావురం కాదు.. తెల్లకాకి అని. అయితే సృష్టిలో కొన్ని సహజత్వానికి భిన్నంగా జరుగుతాయి. ఇలాంటివి కొన్ని సందర్భాలలో నమ్మాలంటే సాధ్యకాదు. అలాంటి వాటిలో ఈ పక్షి ఒకటి. చూసేందుకు తెల్లగా ఉంది. కానీ పావురం అయి ఉంటుందంటారా అలా అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. ఎందుకంటారా ఇది పావురం కాదు కాకి. కాని తెల్లని కాకి. చూడడానికి విచిత్రంగా తెల్లగా ఉంది.
ఈ తెల్లకాకిని ఎప్పుడు చూసి ఉండరు. అయితే దీనిని చూసిన కొందరు ముందుగా పావురం అనుకున్నారు. కానీ అది పావురం కాదని దాని స్వరం ద్వారా వారికి తెలిసింది. ఎందుకంటే అది కావ్ కావ్ మని కాకి లాగా అరుస్తుంది. ఇంకేముంది చివరికి ఇది తెల్లకాకేనని గుర్తించారు. తెలుపు రంగులో ఉంది కాబట్టి దాన్ని అందరూ తెల్ల రంగు కాకిగా గుర్తించారు. ఈ వింత తెల్ల కాకిని చూసేందుకు స్థానికులు భారీగా వచ్చారు. ఈ వింత ఘటన ఏలూరు జిల్లా కైకలూరులో చోటు చేసుకుంది. కైకలూరు స్థానిక ప్రభుత్వ కార్యాలయాల సముదాయం వద్ద చెట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే ఆ చెట్లపై ఎక్కువగా కాకులు వాలుతూ గోల చేస్తుంటాయి.
ఈ చెట్లపై ఉన్న కాకుల మధ్యలో ఓ తెల్లకాకి కనిపించింది. అందరు దీనిని విచిత్రంగా చూశారు. ముందుగా దాన్ని అందరూ పావురం అని అనుకున్నారు. కానీ కాసేపటి తర్వాత వారికి అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ తెల్లని పక్షి పావురం కాదు.. అది కూడా కాకే.. అది సాధారణ నల్ల కాకికి లాగానే కావ్ కావ్ మని అరుస్తుంది. అయితే ఆ తెల్ల కాకిని చూసేందుకు అక్కడ స్థానికులు క్యూ కట్టారు. ఎపుడు కూడా తెల్లరంగులో ఉన్నటువంటి కాకిని చూడలేదని, ఇలా చూడటం మొదటి సారి అని స్థానికులు చెబుతున్నారు.