జగన్ పై ఆది సంచలన కామెంట్స్ .. ఏమన్నారంటే?
బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.;

బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో జగన్‌కు 11సీట్లు కూడా రాకుండా చేస్తామని ఆదినారాయణ రెడ్డి అన్నారు. జగన్‌కు స్కీమ్‌లు తెలియదు, స్కామ్‌లే తెలుసునని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు అభిమానం, ఆధ్యాత్మికత, ఆధునికీకరణ లేవని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అన్నారు.
హామీలను అమలు చేసి...
సూపర్ సిక్స్ హామీలను వంద శాతం తమ ప్రభుత్వం అమలు చేస్తుందని ఆదినారాయణరెడ్డి తెలిపారు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. వరసగా ఒక్కో హామీని అమలు పర్చుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళుతుందని చెప్పారు. కాశీనాయన క్షేత్రానికి భూమి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తెలిపారు.