టీడీపీ కార్యాలయానికి తిరువూరు కార్యకర్తలు
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి పెద్ద సంఖ్యలో రమేష్ రెడ్డి తో పాటు కార్యకర్తలు చేరుకున్నారు.;

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి పెద్ద సంఖ్యలో రమేష్ రెడ్డి తో పాటు కార్యకర్తలు చేరుకున్నారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఆయన వైఖరి పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందని క్యాడర్ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ తాను చంద్రబాబు, లోకేశ్ తో మాట్లాడి తిరువూరు వివాదానికి ఫుల్ స్టాప్ పెడతామనితెలిపారు.
దాట వేసిన కొలికపూడి...
మరోవైపు డీఆర్సీ సమావేశానికి హాజరైన కొలికపూడి శ్రీనివాసరావు తన రాజీనామాపై సమాధానాన్ని దాట వేశారు. మీటింగ్ లో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను 48 గంటల డెడె లైన్ దాటిపోయిందని, ఇప్పుడు ఏం చేస్తారని ఆయనను ప్రశ్నించగా, తాను దీనికి త్వరలోనే సమాధానమిస్తానని ముక్తసరిగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.