తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చిరుతపులి
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చిరుతపులి సంచారం కలకలం రేపింది;

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. చిరుతపులిని చూసిన యూనివర్సిటీ విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. బయటకు కూడా రాలేదు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే అటవీ శాఖ అధికారులు వచ్చేలోగా చిరుత పులి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో దాని పాదముద్రలను చూసి నిర్ధారించారు.
జాగ్రత్తగా ఉంటూ...
అయితే విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. చిరుతపులి ఈ ప్రాంతంలో్నే తిరుగుతున్నందున బయటకు వచ్చే సమయంలో గుంపుగా రావాలని, రాత్రి వేళ మాత్రం ఒక్కరూ రావద్దని కోరారు.తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చిరుతపులి మళ్లీ కనిపిస్తే తమకు వెంటనే సమాచారం అందించాలని అటవీ శాఖ అధికారులు చెప్పారు.