సీదిరి అప్పలరాజుపై పోలీసు కేసు
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు;

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాశీబుగ్గ పీఎస్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసుకు సంబంధించి విచారణ జరుపుతున్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కేసు నమోదు చేశారు. పోలీసులు తమ పనిచేసుకోకుండా అడ్డుకున్నారని కేసులో పేర్కొన్నారు.
పోలీసు విధులకు...
పోలీసులు నచ్చచెప్పినా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వినకుండా అక్కడే ఉండటంతో పోలీసులు తమ విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నారని అందిన ఫిర్యాదుపై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. సీదిరి అప్పలరాజుతో పాటు మరో 16 మందిపై కేసు నమోదు చేసిన కాశీబుగ్గ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తాము ఎలాంటి కేసులకు భయపడబోమని సీదిరి అప్పలరాజు తెలిపారు.