Andhra Pradesh : నేడు పీ4 పథకం ప్రారంభం

ఉగాదికి ప్రతిష్టాత్మకమైన పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. పీ4 పథకానికి శ్రీకారం చుట్టనున్నారు;

Update: 2025-03-30 02:02 GMT
chandrababu, chief minister, P4 scheme, ugadi
  • whatsapp icon

ఉగాదికి ప్రతిష్టాత్మకమైన పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. పీ4 పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. అమరావతి ప్రాంతంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు, వారికి అన్ని రంగాల్లో చేయూతను అందించేందుకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం డిజైన్ చేశారు.

సంపన్నుల చేత...
దేశంలో, విదేశాల్లో ఉన్న భారతీయ మూలాలున్న సంపన్నులు కొన్ని పేద కుటుంబాలను దగ్గరకు తీసుకోవడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. వారి మౌలిక సమస్యలను తీర్చడమే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. తొలి విడతగా ఇరవై లక్షల పేద కుటుంబాలను ఆదుకునేందుకు ఈ పథకాన్ని నేడు ప్రారంభించనున్నారు.


Tags:    

Similar News