చీఫ్ సెక్రటరీకి ఏబీ నాలుగో లేఖ
పోస్టింగ్ ఇవ్వాలని, తన సస్పెన్షన్ కాలంలో జీతభత్యాలను చెల్లించాలని ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సీఎస్ కు లేఖ రాశారు
తనకు పోస్టింగ్ ఇవ్వాలని, తన సస్పెన్షన్ కాలంలో జీతభత్యాలను చెల్లించాలని ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సీఎస్ కు లేఖ రాశారు. ఆయన చీఫ్ సెక్రటరీకి లేఖ రాయడం ఇది నాలుగోసారి. సుప్రంకోర్టు తీర్పు చెప్పినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. తాను చీఫ్ సెక్రటరీని కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్‌మెంట్ దొరకలేదు. ఇప్పటికి మూడు సార్లు లేఖ రాసినా ఆయన నుంచి స్పందన లేదని ఏబీ వెంకటేశ్వరరావు చెెబుతున్నారు.
సస్పెన్షన్ కాలంలో...
గత టీడీపీ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. ఆయన నిఘా పరికరాల కొనుగోలుపై అవకతవకలకు పాల్పడ్డారని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రెండేళ్ పాటు సస్పెన్షన్ లో ఉంచడంతో ఆయను సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఏబీకి అనుకూలంగా తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వెంటనే తనకు పోస్టింగ్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. తనకు సస్పెన్షన్ కాలంలో జీతభత్యాలను చెల్లించాలని కూడా ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్ చేస్తున్నారు.