ఆంధ్ర యూనివర్సిటీలో అమెరికా సెంటర్.. అమెరికా వెళ్లే విద్యార్థుల కోసం ఉచిత సేవలు

ఆంధ్రా యూనివర్సిటీలో అమెరికన్ కార్నర్‌ను ప్రారంభించారు. అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అక్కడి విద్యా, ఉద్యోగావకాశాలతో పాటు విద్యాసంస్థలు

Update: 2023-08-25 16:36 GMT

ఆంధ్ర యూనివర్సిటీలో అమెరికా సెంటర్..

అమెరికా వెళ్లే విద్యార్థుల కోసం ఉచిత సేవలు

ఆంధ్రా యూనివర్సిటీలో అమెరికన్ కార్నర్‌ను ప్రారంభించారు. అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అక్కడి విద్యా, ఉద్యోగావకాశాలతో పాటు విద్యాసంస్థలు, వాటి ప్రవేశ పరీక్షల తీరు, భాష, సంస్కృతి, ఆ దేశ రాజకీయాలు, వాతావరణ పరిస్థితులు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. అమెరికా నుంచి అధికారికంగా అందించే సమాచారం కాబట్టి ఎటువంటి తప్పు జరిగే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని విద్యార్థులు ఎవరైనా తమని సంప్రదించవచ్చునని వారు తెలిపారు.

“అమెరికాలో విద్యార్థికి అవసరమయ్యే ప్రతి అంశంపై అవగాహన కల్పించేందుకు సందేహాలు తీర్చుతామని, ఇందుకోసం ప్రత్యేకంగా ఫ్యాకల్టీని నియమించడంతో పాటు ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉంచామని అధికారులు చెబుతున్నారు. అమెరికా కాన్సులేట్ అధికారులతో విద్యార్థులే నేరుగా మాట్లాడే అవకాశం కూడా అమెరికన్ కార్నర్‌లో లభిస్తుందని వారు తెలిపారు.

Tags:    

Similar News