మరికాసేపట్లో తీర్పు
టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ పిటీషన్ పై నేడు ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది. పదకొండు గంటలకు తీర్పు వెలువడనుంది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కస్టడీ పిటీషన్ పై నేడు ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది. ఉదయం పదకొండు గంటలకు తీర్పు వెలువడనుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏసీబీ కోర్టు చంద్రబాబును స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో సీఐడీకి కస్టడీకి అనుమతిస్తుందా? లేదా? అన్నది మరి కాసేపట్లో తేలనుంది. తెలుగుదేశం పార్టీ నేతలు, క్యాడర్ కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
కస్టడీ పిటీషన్ పై...
నిన్న దాదాపు మూడు గంటల పాటు ఏసీబీ కోర్టులో ఇరువరి వాదనలను విన్న న్యాయస్థానం నేడు తీర్పు చెబుతామని ప్రకటించడంతో ఎవరికి అనుకూలంగా తీర్పు వస్తుందన్న టెన్షన్ నెలకొంది. రేపటితో చంద్రబాబుకు ఈ కేసులో విధించిన రిమాండ్ ముగియనుంది. ఈ నెల 22వ తేదీ వరకూ ఈ కేసులో రిమాండ్ విధించిన కోర్టు ఇప్పటి వరకూ కస్టడీకి అనుమతించలేదని సీఐడీ వాదించింది. తప్పుడు కేసు అని, రాజకీయ కక్ష సాధంపు చర్య అని చంద్రబాబు తరుపున న్యాయవాదులు వాదించారు.