ఏపీలో తగ్గని కోవిడ్ ఉద్ధృతి.. 70 వేలు దాటిన యాక్టివ్ కేసులు
విశాఖలో ముగ్గురు, నెల్లూరు ఇద్దరు, తూ.గో జిల్లాలో ఒకరు చొప్పున మొత్తం ఆరుగురు కోవిడ్ తో మరణించారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో
ఏపీలో కోవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కరోనా బులెటిన్ విడుదల చేయగా.. గడిచిన 24 గంటల్లో 43,763 శాంపిళ్లను పరీక్షించగా.. 12,926 మందికి పాజిటివ్ గా తేలింది. వీటితో కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 73,143కి పెరిగింది.
Also Read : పనిమనిషి అనుమానాస్పద మృతి.. హత్యా? ప్రమాదమా ?
ఇక ఇదే సమయంలో విశాఖలో ముగ్గురు, నెల్లూరు ఇద్దరు, తూ.గో జిల్లాలో ఒకరు చొప్పున మొత్తం ఆరుగురు కోవిడ్ తో మరణించారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 14,538కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 3,913 మంది కోవిడ్ బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 21,66,194 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 20,78,513 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.