సుప్రీంకోర్టులో మోహన్ బాబుకు ఊరట
సినీనటుడు మంచు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.;
సినీనటుడు మంచు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తదుపరి విచారణ వరకూ మోహన్ బాబు పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. జర్నలిస్ట్ పై దాడి చేసిన కేసులో బహిరంగంగా మోహన్ బాబు క్షమాపణ చెప్పారని ఆయన తరుపున న్యాయవాది చెప్పారు.
నాలుగు వారాల పాటు...
అయితే ఇంట్లోకి వచ్చినంత మాత్రాన జర్నలిస్ట్ పై దాడి చేస్తారా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మోహన్ బాబు కు ఈ కేసులో హైకోర్టులో ఊరట దక్కలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తదుపరి విచారణ వరకూ మోహన్ బాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరడంతో ఈ కేసులో ఆయనకు కొంత ఊరట లభించినట్లేనని అనుకోవాలి.