తిరుపతి లో బాధితులను పరామర్శించిన మంత్రులు.. ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియో

తిరుపతి లో బాధితులను పరామర్శించిన మంత్రులు.. ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియో;

Update: 2025-01-09 06:23 GMT

తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలు ఒక్కొక్కొరికి ఇరవై ఐదు లక్షల రూపాయలను ప్రభుత్వం ఎక్స్ గ్రేషియో ప్రకటించింది. తిరుపతికి వెళ్లిన మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, ఆనం రామనారాయణరెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

పరామర్శకు వెళ్లిన...
తిరుపతి రుయా ఆసుపత్రికి వెళ్లిన మంత్రులు అక్కడ బాధితులను కూడా పరామర్శించి అందుతున్న వైద్య సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. పూర్తి స్థాయిలో నివేదిక అందాల్సి ఉందన్నారు. ఈ ఘటన ప్రమాద వశాత్తూ జరిగిందా? కుట్ర కోణం ఏమైనా ఉందా? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తామని వంగలపూడి అనిత తెలిపారు.


Tags:    

Similar News