Tirupathi : తిరుపతి తొక్కసలాటకు అసలు కారణం చెప్పిన భూమన
తిరుపతిలో తొక్కిసలాటపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు.;
తిరుపతిలో తొక్కిసలాటపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు.ఆయన తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ అనవసర ఆరోపణలు చేస్తూ అసలు విషయాలను పట్టించుకోకపోవడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందన్నారు. దీనికి పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలని అన్నారు. పోలీసులు, టీటీడీ విజిలెన్స్ వైఫల్యమే తొక్కిసలాటకు కారణమని అన్నారు.
పది మంది పోలీసులు కూడా...
నెలరోజులుగా వైకుంఠ ఏకాదశికి సమీక్షల పేరుతో హడావిడి చేసి టోకెన్లు జారీ చేసే సమయంలో పట్టుమని పది మంది పోలీసులు కూడా అక్కడ లేరని ఆయన అన్నారు. పనిచేసే వాళ్లు తక్కువని, పర్యవేక్షించేవాళ్లు ఎక్కువయ్యరాంటూ ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలు బాధపడుతన్నారని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంది.