తిరుపతి లో బాధితులను పరామర్శించనున్న జగన్

తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలను వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించనున్నారు;

Update: 2025-01-09 06:29 GMT

తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలను వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. ఆయన ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు తిరుపతికి చేరుకుంటారు. రుయా ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు. అలాగే మృతుల కుటుంబాలను కూడా పరామర్శించి తొకిస్కలాటకు జరిగిన కారణాలను అడిగి తెలుసుకోనున్నారు.

తిరుపతికి వెళ్లి...
మధ్యాహ్నం మూడు గంటలకు జగన్ తిరుపతికి చేరుకుని రుయా ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ చేస్తుండటంతో తిరుపతిలో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరిగి దాదాపు ఆరు మంది మరణించిన నేపథ్యంలో జగన్ తిరుపతి పర్యటన జరుగుతుంది.


Tags:    

Similar News