ఆడుదాం ఆంధ్ర.. ఆడడానికి మీరు సిద్ధమైతే!!
ఏపీలో 'ఆడుదాం-ఆంధ్ర' క్రీడా పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం
ఏపీలో 'ఆడుదాం-ఆంధ్ర' క్రీడా పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. క్రీడల్లో విజేతలకు ప్రభుత్వం నగదు బహుమతులు ప్రకటించింది. గ్రామ/వార్డు సచివాలయ స్థాయి నుంచి ఐదు దశల్లో పోటీలను నిర్వహించనున్నారు. ప్రతి దశలోనూ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడంతో పాటుగా విజేతలను సర్టిఫికెట్స్, మెమెంటోలు, నగదు పురస్కారాలతో సత్కరించనుంది. 15ఏళ్లు పైబడిన వయసున్న బాలబాలికలు అందరిని పోటీలలో భాగస్వాముల్ని చేసేలా 'ఓపెన్ మీట్'ను పోటీలు చేపడుతున్నారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ డబుల్స్‌లో విజేతలకు నగదు బహుమతులు ఇవ్వనున్నారు.
రాష్ట్రంలో 'ఆడుదాం-ఆంధ్ర' క్రీడా పోటీల రిజిస్ట్రేషన్ ప్రారంభించారు. డిసెంబరు 13 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. 15 ఏళ్లకు పైబడిన క్రీడాకారులు సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయంలో, వాలంటీర్ల ద్వారా, ఆన్‌లైన్‌లో aadudamandhra.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా పేర్లను నమోదు చేసుకోవచ్చు. 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో డిసెంబర్ 15 నుంచి ఫిబ్రవరి 3 వరకు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ డబుల్స్, కబడ్డీ, ఖోఖోతో పాటు సంప్రదాయ యోగ, టెన్నీకాయిట్, మారథాన్ అంశాల్లో పోటీలు జరుగుతాయి. పోటీల్లో విజేతలకు సర్టీఫికెట్లు, ట్రోఫీలు, పతకాలు అందజేస్తామని చెప్పారు. నియోజవకర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయి విజేతలకు ప్రత్యేక నగదు బహుమతులు అందజేయనున్నారు.