చిత్రావతి నదిలో జగన్ బోటింగ్

కడప జిల్లాకు చేరుకున్న జగన్ చిత్రావతి నదిలో జగన్ బోటింగ్ ను ప్రారంభించారు.

Update: 2022-12-02 08:08 GMT

కడప జిల్లాకు చేరుకున్న జగన్ చిత్రావతి నదిలో జగన్ బోటింగ్ ను ప్రారంభించారు. సీబీఆర్ వద్ద జెట్టీని ఆయన ప్రారంభించి నదిలో కొంతసేపు బోటింగ్ చేశారు. జగన్ వెంట ఎంపీ అవినాష్ రెడ్డి, తాడిప్రత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూడా ఉన్నారు.

అభివృద్ధి పనులను...
చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద 6.50 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను జగన్ ప్రారంభించారు. ఈ రిజర్వాయర్ వద్ద టూరిజం పార్క్ తో పాటు రెస్టారెంట్, బోటింగ్ ను ఏర్పాటు చేశారు. జగన్ వెంట ఉన్నతాధికారులతో పాటు జిల్లా పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు.


Tags:    

Similar News