Breaking : మంత్రి అప్పలరాజుకు అత్యవసర పిలుపు

ముఖ్యమంత్రి జగన్ కార్యాలయం నుంచి పిలుపు రావడంతో మంత్రి అప్పలరాజు హడావిడిగా బయలుదేరి వెళ్లారు

Update: 2023-03-31 06:14 GMT

మంత్రి సీదిరి అప్పలరాజుకు అత్యవసర పిలుపు వచ్చింది. ముఖ్యమంత్రి జగన్ కార్యాలయం నుంచి పిలుపు రావడంతో ఆయన హడావిడిగా బయలుదేరి వెళ్లారు. దీంతో సీదిరి అప్పలరాజు హడావిడిగా బయలుదేరారు. నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని బయలుదేరి వెళ్లారు.

మంత్రి వర్గ విస్తరణ...
మంత్రి వర్గ విస్తరణ ఉంటుందనుకుంటున్న నేపథ్యంలో అప్పలరాజు తాడేపల్లి కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. సీదిరి అప్పలరాజు రెండోసారి విస్తరణ సమయంలో మంత్రి పదవి లభించింది. మోపిదేవి వెంకటరమణ శాసనమండలికి రాజీనామా చేసి రాజ్యసభకు ఎంపికయిన నేపథ్యంలో ఆయనను జగన్ మత్స్యకారుల కోటా కింద మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే మరోసారి మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఆయనకు జగన్ నుంచి పిలుపురావడం పార్టీలో చర్చనీయాంశమైంది.


Tags:    

Similar News