Pawan Kalyan : ఏడేళ్ల తర్వాత సచివాలయానికి పవన్.. సాదరంగా ఆహ్వానించిన చంద్రబాబు
ఏడేళ్ల తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ సచివాలయానికి వచ్చారు. డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో అడుగు పెట్టారు.
ఏడేళ్ల తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ సచివాలయానికి వచ్చారు. డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో సచివాలయంలోకి అడుగు పెట్టారు. 2017ల ో ఉద్దానం సమస్యలపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యేందుకు పవన్ కల్యాణ్ సచివాలయానికి వచ్చారు. ఆ తర్వాత పవన్ ఇటు వైపు రాలేదు. మొన్నటి ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం, పవన్ డిప్యూటీ సీఎం కావడంతో ఆయన ఈరోజు సచివాలయానికివ వచ్చారు. సచివాలయానికి వచ్చిన పవన్ కల్యాణ్ కు ముఖ్యమంత్రిచంద్రబబు సాదరంగా ఆహ్వానించారు. తన ఛాంబర్ లో కూర్చోబెట్టి కాసేపు ఇద్దరు ముచ్చటించుకున్నారు.
రేపు బాధ్యతలు...
రేపు పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలను స్వీకరించనున్నారు.తన ఛాంబర్ ను పరిశీలించిందుకు వచ్చిన పవన్ సెక్రటేరియట్ లోని సీఎం ఛాంబర్ కు వెళ్లారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ను చంద్రబాబు ఆలింగనం చేసుకున్నారు. పవన్ చంద్రబాబుకు పుష్పగుచ్ఛం అందించి విష్ చేశారు.
పవన్ వెంట మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కూడా ఉన్నారు. పవన్ కల్యాణ్ సచివాలయానికి వస్తుండటంతో జనసేన పార్టీనేతలతో పాటు రాజధాని అమరావతి రైతులు కూడా సాదర స్వాగతం పలికారు. సెక్రటేరియట్ ఉద్యోగులు సయితం పవన్ కల్యాణ్ ను చూసేందుకు పోటీపడ్డారు. వారందరినీ పవన్ నవ్వూతూ పలుకరించారు.