Chandrababu : నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.

Update: 2024-12-24 02:58 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఆయన ఉండనున్నారు. వాజ్ పేయి శత జయంతి వేడుకల్లో చంద్రబాబు పాల్గొంటారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్రంలోని పెద్దలను కలిసే అవకాశముంది. రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలపై చర్చించనున్నారు.


కేంద్రంలో పెద్దలను కలసి...

ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో కూడా సమావేశమై రాజకీయ పరిణామాలతో పాటు ఏపీకి కావాల్సిన అభివృద్ధి పనులను గురించి చర్చించనున్నారు. వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన విషయంపై కూడా మాట్లాడనున్నారు. దీంతో పాటు ఆర్థిక శాఖ మంత్రితో పాటు పలువుురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశముందని తెలిసింది.




Tags:    

Similar News