మరోసారి అమరావతి రైతుల పాదయాత్ర

మరోసారి రాజధాని అమరావతి రైతులు పాదయాత్ర చేపట్టబోతున్నారు. వచ్చే నెల 12వ తేదీ నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది

Update: 2022-08-17 03:39 GMT

మరోసారి రాజధాని అమరావతి రైతులు పాదయాత్ర చేపట్టబోతున్నారు. వచ్చే నెల 12వ తేదీ నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది. హైకోర్టు తీర్పును అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలంటూ రాజధాని రైతులు పాదయాత్ర చేయబోతున్నారు. వెంకటాయపాలెంలో టీటీడీ నిర్మించిన తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకూ ఈ పాదయాత్ర కొనసాగుతుంది.

రెండు నెలల వరకూ...
దాదాపు రెండు నెలల వరకూ ఈ యాత్ర కొనసాగనుంది. ఇందుకు సంబంధించిన రోడ్డు మ్యాప్ ను రాజధాని రైతులు సిద్ధం చేసుకున్నారు. గత ఏడాది అక్టోబరు 17 నుంచి డిసెంబరు 17 వరకూ తుళ్లూరు నుంచి తిరుమల వరకూ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి హైవే మీద కాకుండా పల్లెలు, పట్టణాల మీదుగా పాదయాత్ర కొనసాగించాలని రైతులు నిర్ణయించారు. అరసవల్లిలో ఈ పాదయాత్ర ముగియనుంది. పాదయాత్రకు బయలు దేరే ముందు హోమం కూడా నిర్వహించాలని రైతులు నిర్ణయించారు.


Tags:    

Similar News