Vijayawada : విజయవాడ వాసులకు గుడ్ న్యూస్

విజయవాడ వాసులకు ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2024-06-15 03:50 GMT

విజయవాడ వాసులకు ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. గన్నవరం విమానాశ్రయం నుంచి ముంబయికి విమాన సర్వీసులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడ నుంచి ముంబయి ఎయిర్ ఇండియా ఎయిర్ లైన్స్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

ముంబయికి నేటి నుంచి...
దీంతో నేరుగా ముంబయికి విజయవాడ వెళ్లేందుకు మార్గం సుగమమయింది. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ తో పాటు మచిపలీపట్నం పార్లమెంటు సభ్యులు బాలశౌరి కూడా పాల్గొననున్నారు. వాణిజ్య రాజధాని ముంబయికి విజయవాడ నుంచి సర్వీసులు ప్రారంభం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News