Tirumala : తిరుమలకు అగ్రనేతల వరస పర్యటనలు
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన అగ్రనేతలందరూ వరసగా రానున్నారు
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన అగ్రనేతలందరూ వరసగా రానున్నారు. దీంతో కొంత ఉద్రిక్తతలు తలెత్తే అవకాశాలున్నాయి. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 27వ తేదీన కాలినడకన తిరుమలకు చేరుకుంటారు. 28వ తేదీన తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారు. తనపైన, తన పార్టీ నేతలపైన వస్తున్న ఆరోపణలకు ఆయన స్పందిస్తూ శనివారం తిరుమలకు చేరుకుంటారు.
పవన్, చంద్రబాబు...
కాగా వచ్చే నెల 1వ తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తిరుమలకు రానున్నారు. ఆయన తిరుమలకు చేరుకుని ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు. తిరుమలకు చేరుకుని ఆయన పదకొండు రోజుల పాటు దీక్ష విరమించనున్నారు. అక్టోబరు 3వ తేదీన తిరుపతిలో వారాహి సభను పవన్ కల్యాణ్ నిర్వహించనున్నారు. ఇక వచ్చే నెల 4వ తేదీన తిరుమలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు రానున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వస్తుండటంతో ముగ్గురు నేతల రాకతో తిరుమలలో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంటుంది.