Amaravathi : మరో మైలురాయి చేరుకున్న అమరావతి ఉద్యమం

అమరావతి రాజధాని ఉద్యమం నేడు మరో మైలు రాయికి చేరుకుంది. నేటికి పదిహేను వందల రోజుకు చేరుకుంది;

Update: 2024-01-25 03:00 GMT

అమరావతి రాజధాని ఉద్యమం నేడు మరో మైలు రాయికి చేరుకుంది. నేటికి పదిహేను వందల రోజుకు చేరుకుంది. పదిహేను వందల రోజుల నుంచి రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు అమరావతి ప్రాంతంలో ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వివిధ పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నారు.

పదిహేను వందల రోజులుగా...
గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించగా, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదన తేవడంతో ఉద్యమాన్ని ప్రారంభించారు. పాదయాత్రగా న్యాయస్థానం టు దేవస్థానం వెళ్లారు. తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుని తమ గోడును చెప్పుకున్నారు. అమరావతి ప్రాంతంలో టెంట్లు వేసుకుని గత పదిహేను వందల రోజులుగా రైతులు రాజధానిని ఇక్కడే కొనసాగించాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. నేడు పదిహేను వందల రోజుకు ఉద్యమం చేరడంతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.


Tags:    

Similar News