Ys Jagan : నేడు కడపకు జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు కడప జిల్లా పులివెందులకు చేరుకోనున్నారు.;
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు కడప జిల్లా పులివెందులకు చేరుకోనున్నారు. ఈయన తన వైఎస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఏఎంజీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించారు. శుక్రవారం మరణించడంతో ఆయన అంత్యక్రియలు శనివారం పులివెందులలోని ఆయన తోటలో జరగనున్నాయి.
పెదనాన్న మనవడు...
అభిషేక్ రెడ్డి వైఎస్ జగన్ పెదనాన్న ప్రకాష్ రెడ్డి మనవడడు కావడంతో అభిషేక్ అంత్యక్రియలకు హాజరవుతున్నారు. అభిషేక్ రెడ్డి మృతి వైఎస్ కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశముంది. వైద్యుడిగా ఉంటూ పార్టీకి కూడా సేవలందించిన అభిషేక్ రెడ్డికి నివాళులర్పించేందుకు పెద్ద సంఖ్యలో కడప జిల్లా నుంచి కార్యకర్తలు తరలి వస్తున్నారు.