తిరుపతి సభకు వెళ్దామనే ఉంది కానీ?
అమరావతి రైతులకు తొలి నుంచి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు మద్దతిస్తూ వస్తున్నారు
రేపు తిరుపతిలో అమరావతి రైతుల బహిరంగ సభకు తాను వెళ్లాలనుకుంటున్నానని, కానీ తనపై దాడి జరుగుతుందేమోనన్న అనుమానం ఉందని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. అమరావతి రైతులకు తొలి నుంచి రఘురామ కృష్ణరాజు మద్దతిస్తూ వస్తున్నారు. ఆయన మహాపాదయాత్రకు రెండు లక్షల విరాళాన్ని కూడా ప్రకటించారు. జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటకు వ్యతిరేకంగా రఘురామ కృష్ణరాజు రోజూ రాజధాని అమరావతికి మద్దతు పలుకుతున్నారు.
నరసాపురమే రాలేదే.....
ఈ నెల17వ తేదీన జరిగే బహిరంగ సభకు రావాల్సిందిగా రైతుల నుంచి రఘురామ కృష్ణరాజు కు ఆహ్వానం అందింది. అయితే తిరుపతికి వెళితే తననై దాడి జరిగే అవకాశముందని రఘురామ కృష్ణరాజు భావిస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి కూడా తీసుకెళ్లారు. కాగా రఘురామ కృష్ణరాజు దాదాపు రెండున్నరేళ్లుగా నరసాపురం నియోజకవర్గానికి కూడా రాలేదు. ఆయన కరోనా సాకు చూపి ఢిల్లీలోనే గడుపుతున్నారు. తిరుపతి సభకు కూడా తన సందేశాన్ని పంపుతారని చెబుతున్నారు.