అమరావతి రైతులకు హైకోర్టులో ఎదురుదెబ్బ
అమరావతి రైతులకు మరోసారి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నిబంధనలను సవరించాలంటూ దాఖలు చేసిన పిటీషన్ ను కొట్టివేసింది
అమరావతి రైతులకు మరోసారి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నిబంధనలను సవరించాలంటూ దాఖలు చేసిన పిటీషన్ ను కొట్టివేసింది. అమరావతి రైతులు కేవలం 600 మంది మాత్రమే పాల్గొనాలని, వారు కూడా గుర్తింపు కార్డులను చూపాలని న్యాయస్థానం ఆదేశించింది. అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతు తెలిపే వారు కేవలం రెండు వైపులా మాత్రమే ఉండాలని, పాదయాత్రలో ఉండకూడదని ఆదేశించింది.
గత ఆదేశాలను...
దీంతో అమరావతి టు అరసవిల్లి పాదయాత్ర అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిలిచిపోయింది. పాదయాత్ర నిలిచిపోయి ఇరవై రోజులు గడుస్తున్నా రైతులు పాదయాత్రను ప్రారంభించలేదు. తిరిగి నిబంధనలను సవరించాంటూ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈసారి కూడా గతంలో ఇచ్చిన తీర్పునకు లోబడి పాదయాత్ర చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. గత ఆదేశాలను మాత్రమే పాటించాలని పేర్కొంది. దీంతో రైతులు పాదయాత్రను ప్రారంభిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.